Feb 28, 2010

చరిత్ర , ఒక కల్పన

"ఈ నవలలో రచించిన పాత్రలన్నీ నా ఊహలో జనించిన ఆదర్ష ప్రాయులైన దేవతలు కారు. 12, 13 శతాబ్దాల సంధి లో ఈ భూమి మీద పుట్టి కష్టనిష్టూరాలు అనుభవించిన మానవులు .అందుచేత ప్రతి పాత్రలోనూ మంచిచెడూ రెండు ఉంటాయి ", అని అంటారు  “ఛెంఘిజ్ ఖాన్”  పరిచయం లో తెన్నేటి సూరి.
చారిత్రక నవలను రెండు విధాలుగా మనం అర్ధం చేసుకోవచ్చు..ఒకటి చరిత్ర పుటల్లోని రాజకీయ సామాజిక అంశాలను పరిశోధన చేసి ,సూక్ష్మం గా సమగ్రంగా శాస్త్రీయంగా ఒక దేశకాలాలను పునఃసృష్టి చేయగల అవకాశం.
రెండవది ..చరిత్రను ఒక కల్పనగా భావించే రచయితకు అందే అపరిమితమైన స్వేచ్ఛ.
దేశకాలసీమితమైన జీవితాన్ని అర్ధం చేసు కోవడం కోవడం రచయిత బాధ్యత అంటారు వల్లంపాటి.
అటు పాశ్చాత్య లొకంలో నరరూపరాక్షసుడిగా చిత్రించబడిన ఛెంగిజ్ ఖాన్ కు,
ఇటు “నాకు ఆదర్శ ప్రాయుడైన నాయకుడు” అంటూ నెహ్రూ చేత గౌరవవందనం అందుకొన్న చెంగిజ్ ఖాన్ కు,  నడుమ ."ఒక మానవుని"ఆవిష్కరించే ప్రయత్నాన్ని తెలుగు నవల చేసింది.
ఒక చారిత్రక నవలకు నిండైన ఉదాహరణ “ చెంగిజ్ ఖాన్ “మన ముందు ఉన్నది.
ఎన్ని ఏళ్ళ "పరిశ్రమ "ఫలితమో రచయిత ప్రస్తావించక పోయినా మనకు తెలుస్తూనే ఉంటుంది.
తేదీలకూ గణాంకాలకు చరిత్రలో ఉన్న ప్రాధాన్యత ఏమిటొ మనకు తెలుసు.
ఇప్పటి  "చారిత్రక స్పృహ తో రాసే నవలాకారులు ఇలాంటి చిన్న చిన్న వివరాలే నవలకు ఒక వాస్తవిక భూమికను ,దెశకాల నేపధ్యాన్ని ఇస్తాయని తెలియని వారు కారు.
చరిత్ర వట్టి అభూత కల్పన కాదనీ మనకు తెలుసు.
మన కల్పనాసాహిత్యానికి  బలీయమైన నేపధ్యంగా మన చారిత్రికజ్ఞానం ఉపయోగపడాలే కాని మరిన్ని భ్రమలను కల్పించుకొంటూ  పోకూడదు కదా ?
తక్షణ రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాలతో చరిత్రను ఒక సాధనం గా వాడుకోవడం తెలుగు నవలలో సర్వత్రా కనబడుతుంది.
ముందుగా చెప్పుకున్నట్లుగానె, ఇది సమాచార యుగం. చరిత్ర ఒక తెరిచిన పుస్తకం.
పునర్మూల్యంకనం ప్రతి తరంలోను జరుగుతూ ఉంటుంది.
మనం చేస్తొన్న పునర్మూల్యంకానాన్ని మన ముందు తరాల వారుకూడా చేస్తారన్నది వాస్తవం.
సమకాలీనత అన్నది సాపేక్ష పదం సర్వకాలీనత అన్నది అంతే.
సిధ్ధాంతాలతో జీవితాన్ని కొలవానుకోవడం సమంజసం కాదు. జీవితం కోసం సిద్ధాంతాలు ఉన్నయి ..అన్న కొడవటికంటి మాటలను ఒకసారి పేర్కొనాలి.
ముఖ్యంగా చరిత్ర గురించి వ్రాసేటప్పుదు.. తెలుగు నవలాకారులు తమ భావోద్రేకస్తాయిలోనో ను0చి  తమ"రాజకీయ సిద్దంతాల అంచులనుంచొని ఒక పరిధి గిరి గీసుకొని వ్రాయడం మొదలు పెడుతున్నారు.
అది  white moghuls లోని ఖైరున్నిసా ఉదంతాన్ని యథాతదంగా తిరిగి వ్రాయడమేనా కావచ్చు..రెండొ ప్రపంచ యుధ్ధకాలంలో ఆర్ధిక మాంద్యత ఉన్న రోజుల్లొ బస్తావడ్లు  (అక్కుళ్ళు) నాలుగున్నర రుపాయలో (మొలకొలకులు )అయిదు రూపాయలో ఉన్నప్ప్డు ఒక ఎద్దు విలువ అయిదు వందల రుపాయలనీ వ్రాయవచ్చు.
((ఆకాలం లో మాగాణి ప్ర్రాంతంలో జట దుక్కిట్లెడ్ల విలువ ఇరవై బస్తాల వడ్లతో సమానంగా ఉండేదని ..తెలిసింది.(శ్రీ గొగినేని నాగేశ్వర రావు గరు,నడింపల్లి ,మునసబు)మరి ,రాయసీమ ప్రాంతంలో పరసలో ఒక ఎద్దు ఖరీదు అయిదు వందల వరకు పలకవచ్చుననీ (మునెమ్మ,oct 2007)
 అంత ఖరీదు పలకడం ..అధ్యయనం చేయవలసి ఉంది. రాయలసీమలోని (పరసలోనే నిలబేట్టి ఉంటే దాన్ని యట్టలేదన్న అయిదు నూర్లకు అమ్మి ఉండవచ్చ్చు.నాగుల మర్రి కాడనే నిలబెట్టి రెండు నూర్లకు అమ్మేసినాడు.pg,54,చతుర)
పునర్ మౌల్యాంకనం సాహిత్య కృతిని మొదటిసారి విలువ కట్టడం కంటే మారిపోయిన చారిత్రక సామాజిక పరిస్థుతుల లో విలువ కట్టడం చాలా క్లిష్టమైన పని.మళ్ళీ మళ్ళీ విలువ కట్టడం మరింత కష్టమైన పని.
అని అంటారు ..వల్లంపాటి.
వ్యంగ్యాత్మక హాస్యరచన "గణపతి" ని మరొక మారు చదివి చూడాలి.బహుశా బ్రహ్మమతస్తుల దృష్టీ మరింత సమగ్రం గా అర్ధం అవుంతుందను కొంటాను. నవలా పరిణామం  లో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం పక్కకు పెడుతూ వస్తున్నాము.
***
చరిత్ర ఈ నవలకు అస్తిపంజరం అమర్చడానికి ఉపకరించి , దానికి ఒక రూపాన్ని ఇచ్చింది.సజీవ పరిచినది కల్పనతోనే ."అని అంటారు తమ చారిత్రక నవల  " జయ యౌధేయ " ఉపోద్ఘాతంలో  రాహుల్ సాంకృత్యాయన్.
ఒక చారిత్రక నవలలో చరిత్రకు నవలకు మధ్య ఉండవలసిన ఆ సున్నిత సృజనాత్మక బంధాన్నిగురించి  ఇంతకన్న ఏమి వివరించ గలం?
 ***

All rights @ writer.

Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. Chandra Latha garu,
    I will probably talk tangentially about your thoughts. Sometime ago, I thought that I should take some interest in history since things which we do not have any memory seem to have effect on our current lives.Sinple eaxmples. When I go home, they say we should not eat brinjal this month or there is varalaksmi vratam today. Or Sradham to done over a period of months with 11-14 days at the beginning, a day for some sort of world. Even people who do not know the significanc , if there is any, feel obliged to follow these so as not upset others in the community. So I thought that may be I should lern history to find about how these started. So far I find history it very confusing. People with somewhat scientificbackground like me want some evidence or primary sources. This comes from documents or inscriptions etc. But inscriptions are often prasasthis ( See Cynthia Talbot' book on medieval Andhra) written by scribes for dominant groups or rules and so have stake in what is written. Similarly documents in the south often come from karnams who again have a stake in the system. Often we do ot know how common people lived. Some of the practices we see seem to be money making propositions which started later than the vedas which themselves are a mixture f all sorts of things including praising rulers for gifts. In any case, primary documents are from thosewho had vested interests. Then we have theso called subaltern stream, again coming from priviligeed classes who disgree with the standard accounts. To get something out of this various streams, we have the so called histirography again by academics striving for university positions. Meanwhile we have histories created by political and religious leaders which probably play a stronger role for their followers. Out of all these different accounts, it is difficult for me to see why some women believe that we should not eat brinjal in a cetain month. I remain confused.
    May be there are primordial memories like Iqbal believing that his brahmin ancestry gave him a better understanding of Islam.

    ReplyDelete
  2. I forgot to add that compared to history some fiction gives me a better idea. For example, stories like "Mahesh' by Sarat or "Edmund Wilson in Benares" by Pankaj Mishra

    ReplyDelete